మరుగుదొడ్లను శుభ్రం చేసిన ఐఏఎస్‌లు

Two IAS Officers cleaned school toilets in Andhra Pradesh - Sakshi

నెల్లూరు (టౌన్‌)/నెల్లిమర్ల: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇద్దరు ఐఏఎస్‌లు శనివారం వేర్వేరు ప్రాంతాల్లో పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేశారు. విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) కిశోర్‌కుమార్‌ నెల్లిమర్ల రెల్లివీధిలో ఉన్న బాలికోన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ మరుగుదొడ్డిలోకి ప్రవేశించి బ్రష్‌ను చేతబట్టి, యాసిడ్‌ పోసి మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. అనంతరం తరగతి గదిలోకి ప్రవేశించి, మరుగుదొడ్లను ఎవరికి వారే శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు హితబోధ చేశారు.

అలాగే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ మరుగుదొడ్డిని శుభ్రపరిచారు. పాఠశాలల ఆవరణలో మొక్కలను నాటారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ..పారిశుధ్య కార్మికులు, ఆయాలను చిన్న చూపు చూడకూడదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకు పైగా పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రతకు రూ.450 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆయాలు ఆర్‌.సుమతి, సీహెచ్‌ గాయత్రి, బుజ్జమ్మ, సీహెచ్‌ రాజేశ్వరిలను సన్మానించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top