వీర జవాన్లుకు ఘన వీడ్కోలు | Two Army Jawans Funeral Completed At Their Native Place | Sakshi
Sakshi News home page

సైనిక లాంఛనాలతో జవాన్‌ల అంత్యక్రియలు

Nov 11 2020 12:13 PM | Updated on Nov 11 2020 6:03 PM

Two Army Jawans Funeral Completed At Their Native Place - Sakshi

సాక్షి, చిత్తూరు/నిజామాబాద్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రమూకల కాల్పుల్లో అమరులైన వీర జవాను‌   ర్యాడ మహేశ్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి వైకుంఠ ధామంలో మహేశ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ పార్థివ దేహంపై కుటుంబ సభ్యులు జాతీయ జెండాను ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. జవాన్‌కు తుది వీడ్కోలు పలకడానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కోమన్‌పల్లి కన్నీటిసంద్రమైంది.  

కాగా.. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన మరో జవాన్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కుటుంబసభ్యులు కన్నీటితో ప్రవీణ్‌కు తుది వీడ్కోలు పలికారు. కాగా బుధవారం ఉదయం ప్రవీణ్‌‌ భౌతిక కాయాన్ని సందర్శించి ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు నివాళులర్పించారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement