చిత్తూరు: స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆ సభ జనాలు లేక వెలవెలబోయింది. టీడీపీ పెద్దలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ సభ కాస్తా జనాలు లేకపోవడంతో బోసిపోయింది.

సభా ప్రాంగణంలో జనాలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. భారీ అంచనాల నడుమ ఏర్పాటు చేసిన చంద్రబాబు సభను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబు సభకు ప్రజలు ముఖం చాటేయడంతో టీడీపీ పెద్దలు కంగుతిన్నారు. 


