సాక్షి, చిత్తూరు: జిల్లా సమాచారశాఖ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు కలకలం రేపాయి. చిత్తూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ వేలాయుధం జిల్లా సమాచారశాఖ అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో న్యూడ్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సమాచార శాఖ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల దృశ్యాలు ఉన్న వీడియోలు కనిపించాయి.
చిత్తూరు జిల్లా సమాచార శాఖ డిప్యూటి డైరెక్టర్ వేలాయుధం చేసిన నిర్వాకంతో ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న మీడియా ప్రతినిధులు, జిల్లా అధికారులు అవాక్కయ్యారు. తర్వాత మీడియా ప్రతినిధులు ఫిర్యాదుతో వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలను డిప్యూటి డైరెక్టర్ డిలీట్ చేశారు.


