
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగమయ్యేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈసీఎల్) ముందుకొచ్చింది. గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో ఈఈఎస్‌ఎల్ సీనియర్ అధికారులు అనిమేష్‌మిశ్రా, నితిన్ భుట్ ఢిల్లీ నుంచి ఆదివారం వర్చువల్‌గా సమావేశమయ్యారు.
పేదల ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యల అమలుకు ఈఈఎస్‌ఎల్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అజయ్‌జైన్ మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుల తగ్గింపునకు ఇలాంటి వినూత్న చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేసిన 21.3 లక్షల ఇళ్లలో 20.45 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, నెలాఖరు నాటికి దాదాపు 5 లక్షల ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈఈఎస్‌ఎల్ ద్వారా విద్యుత్ ఆదా చేసే ఎలక్ట్రికల్ ఉపకరణాలను తక్కువ ఖర్చుతో అందజేస్తామని చెప్పారు.