Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. | Tirumala TTD Latest News Updates On July 23 2024 | Sakshi
Sakshi News home page

Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం

Jul 23 2024 7:51 AM | Updated on Jul 23 2024 7:51 AM

Tirumala TTD Latest News Updates On July 23 2024

తిరుపతి, సాక్షి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా..4 గంటల సమయం పడుతోంది. నిన్న (సోమవారం)  71,939 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 26,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం  4.90 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement