
సాక్షి, తిరుపతి: తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర ఉత్సవంతో పాటు జూన్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ శ్రీవారి ఆలయంలో జ్వేష్టాభిషేకం నిర్వహించనున్నారు.
జూన్4వ తేదీన ఏరువాక పూర్ణిమను నిర్వహించనున్నారు. జూన్ 14వ తేదీన మతత్రయ ఏకాదశి, జూన్ 28వ తేదీన పెరియాళ్వార్ ఉత్సవారంభం ఉంది. జూన్ 29వ తేదీన శయన ఏకాదశి కావడంతో చాతుర్మాస్య వ్రతారంభం నిర్వహించనున్నారు.