Three Days Rains In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వానలు

Sep 4 2022 3:44 AM | Updated on Sep 5 2022 9:04 AM

Three days rains Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వానలు కురవనున్నాయి. దక్షిణ, ఆగ్నేయ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగాను, అక్కడక్కడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం నాటి నివేదికలో వెల్లడించింది.

ప్రధానంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమూ ఉందని పేర్కొంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement