
సాక్షి, విజయవాడ: తనను పెళ్లి చేసుకొని మోసం చేశారంటూ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్‌పై సాయికుమారి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై శ్రీకాంత్ స్పందిస్తూ.. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సాయికుమారి అనే మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
గతంలో ఆమె చాలా మందిని ఇలానే బెదిరించి, డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. సాయికుమారి వెనుక ప్రతిపక్షాల రాజకీయ కుట్ర ఉందని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలను ఆధారాలతో సహా బయటపెడతానని శ్రీకాంత్ మీడియాకు వివరించారు.
చదవండి: (శ్రీసత్యసాయి జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో ఉద్రిక్తత)