తెలంగాణలోనూ ‘ఆర్బీకే’ తరహా సేవలు!

Telangana Agriculture Minister Niranjan Reddy to visit AP For RBK - Sakshi

అధ్యయనం కోసం నేడు ఏపీకి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆర్బీకే, అగ్రి ల్యాబ్, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తదితరాలను పరిశీలించనున్న మంత్రి   

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం గురువారం ఏపీలో పర్యటించబోతోంది. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని ఈ బృందం.. గుంటూరు జిల్లాలోని ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్, మినుము ప్రాసెసింగ్‌ యూనిట్, అరటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించనుంది. మంత్రి నిరంజన్‌రెడ్డి గతంలో కూడా ఏపీలోని పలుప్రాంతాల్లో పర్యటించి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తోన్న సేవలను పరిశీలించారు.

తెలంగాణలో కూడా ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌తో పాటు ఆర్బీకే చానల్‌ తరహాలో ఓ అగ్రి చానల్‌ను ప్రారంభిస్తామని నిరంజన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అలాగే ఆర్బీకేల్లోని కియోస్క్‌లను తెలంగాణలోని రైతు వేదికల్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం చేరుకొని.. అరటి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి రైతు లతో మాట్లాడుతారు. అనంతరం తెనాలిలో  వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రికల్చర్‌ ల్యాబ్‌ను సందర్శిస్తారు. తర్వాత అంగలకుదురులోని ఆర్బీకేను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఏటుకూరు సమీపంలోని బొంత పాడు రోడ్‌లో ఉన్న మినుము సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను  పరిశీలిస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top