సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్, గౌతంరెడ్డి విగ్రహాలు

Statues of YSR and Gautham Reddy at Sangam Barrage - Sakshi

నెల్లూరు బ్యారేజ్‌ వద్ద వైఎస్సార్‌ మరో విగ్రహం

రేపు సీఎం జగన్‌ చేతుల మీదుగా ఆవిష్కరణ  

కొత్తపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద దివంగత సీఎం వైఎస్సార్, దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డిల కాంస్య విగ్రహాలతో పాటు, నెల్లూరు బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జి వద్ద వైఎస్సార్‌  విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ తయారు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ మేరకు ఈ మూడు విగ్రహాలను తయారు చేసినట్టు రాజ్‌కుమార్‌ ఆదివారం ‘సాక్షి’తో చెప్పారు. ఒక్కో విగ్రహాన్ని 2.5 టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తుతో తయారు చేశానన్నారు. గౌతంరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో సంగం బ్యారేజీ వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తయారు చేయాల్సిందిగా తనకు సూచించారని గుర్తు చేసుకున్నారు. కానీ వైఎస్సార్‌ విగ్రహంతో పాటు గౌతంరెడ్డి విగ్రహాన్ని కూడా తయారు చేయాల్సి వచ్చిందని రాజ్‌కుమార్‌ భావోద్వేగానికి లోనయ్యారు.
కొత్తపేట శిల్పశాలలో వైఎస్సార్, గౌతంరెడ్డి విగ్రహాలతో శిల్పి రాజ్‌కుమార్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top