Covid: కోలుకున్న స్పీక‌ర్ తమ్మినేని దంప‌తులు | Srikakulam: Speaker tammineni Sitaram Recovered From Covid | Sakshi
Sakshi News home page

Covid: కోలుకున్న స్పీక‌ర్ తమ్మినేని దంప‌తులు

May 12 2021 12:50 PM | Updated on May 12 2021 2:35 PM

Srikakulam: Speaker tammineni Sitaram Recovered From Covid - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: క‌రోనా వైరస్‌ బారిన ప‌డిన ఆంధ్రప్రదేశ్‌ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం దంపతులు పూర్తి చికిత్స అనంత‌రం సంపూర్ణంగా కోలుకున్నారు. శ్రీ‌కాకుళంలో మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రి వైద్యులు ఆయ‌న‌కు క్రిటిక‌ల్ ట్రీట్‌మెంట్‌ అందించి త్వ‌రంగా కోలుకునేట్టు కృషి చేశారు. శ్రీ‌కాకుళంలో క్రిటిక‌ల్ ట్రీట్‌మెంట్‌ అందించిన వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు స్పీకర్‌ తెలియ‌చేశారు. క‌రోనా రోగుల‌కు అందిస్తున్న వైద్యంపై ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు.

స్పీక‌ర్‌గా త‌న‌కు ఎటువంటి వైద్యం అందించారో, ఆరోగ్య శ్రీ ల‌బ్దిదారునికి కూడా ఇదే త‌ర‌హా వైద్యం అందించ‌డాన్ని అభినందించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో రాజ‌కీయ ల‌బ్ది కోసం మాట్లాడ‌టం స‌రికాద‌ని చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి విప‌త్క‌ర‌ ప‌రిస్థితుల్లో రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వాలి గానీ భ‌యాందోళ‌న‌లు క‌లిగించ‌డం మానుకోవాల‌న్నారు.

చదవండి: ల్యాండ్‌లైన్‌ నుంచి ఫోన్‌ చేస్తేనే అంబులెన్స్‌ల అనుమతి

Advertisement
 
Advertisement
Advertisement