‘నే ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి!’ 

Special Story On Plant Breeding In Auto - Sakshi

చీరాల: ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు ఈ ఆటోవాలా. ‘నే ఆటోవాణ్ణి.. ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి’ అంటూ ప్రయాణికుల్ని ఎక్కించుకుని రయ్యిన దూసుకుపోతున్నాడు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన సీహెచ్‌ జక్రయ్య. మొక్కల పెంపకానికి అనువైన స్థలం లేకపోవడంతో జక్రయ్య తన ఆటోలోని ముందు భాగంలో ప్రత్యేకంగా ట్రే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మొక్కలు పెంచేందుకు అనువుగా మట్టి, రాళ్లు వేసి గార్డెన్‌లా తయారు చేశాడు. మొక్కలకు పోసే నీరు కిందికి వెళ్లేలా ఓ పైపును అమర్చాడు.

చదవండి:
‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’కు దరఖాస్తు చేసుకోండి 
ఓపీఎం వెనుక డ్రగ్‌ మాఫియా!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top