హైదరాబాద్‌ ఆసుప్రతికి నిమ్మగడ్డ..

SEC Nimmagadda Ramesh Going To Hyderabad LV Prasad Hospital - Sakshi

సాక్షి, విజయవాడ: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వైఎస్సార్‌ జిల్లా పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్‌ఈసీ సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి ఇన్ఫెక్షన్‌ కారణంగా పర్యటన రద్దు అయ్యింది. కంటి పరీక్షల కోసం హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి నిమ్మగడ్డ వెళ్లనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్‌ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ప్రకటించింది. 
(చదవండి: పిచ్చి పీక్స్‌కు.. తుగ్లక్‌ను మరిపిస్తున్న నిమ్మగడ్డ)
(కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top