breaking news
Eye issues
-
ఆరుబయట ఆట కంటిపాపలకు మేలు
ధరణికి ఎనిమిదేళ్లు. ఈమధ్య బోర్డు మీద రాసింది స్పష్టంగా కనిపించడం లేదని తరచు చెబుతోంది. అమ్మాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. కళ్లు కూడా మెరుస్తున్నట్టుగా మిలమిలలాడుతూ ఉంటాయి. మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు కానీ పదే పదే చెబుతుండటంతో కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పరీక్షలన్నీ చేసిన డాక్టర్ గారు... ధరణి మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్)తో బాధపడుతోందనీ, ఈ సమస్య ఉన్నవారిలో కేవలం చాలా దగ్గరివే కనిపిస్తాయనీ, దూరం ఉన్నవి స్పష్టంగా కనిపించవనీ, దాంతో స్కూల్లో బ్లాక్‌బోర్డుపై ఉన్న రాతలు స్పష్టంగా కనిపించడం లేదంటూ చెప్పారు. అంతే... ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతయ్యింది.ఇది కేవలం ఒక్క కేస్ స్టడీ మాత్రమే. ధరణి లాంటి అమ్మాయిలూ, అబ్బాయిలూ దేశవ్యాప్తంగా ఎందరో! స్కూలుకెళ్లే ఆరు నుంచి 12 ఏళ్ల చిన్నారులు ఈ కంప్లైంట్‌తో రావడం... వాళ్లలో ఈ సమస్య బయటపడటం చాలా సాధారణం. ఈ సమస్యకు కారణం మొదటిది వంశపారంపర్యంగా మయోపియా ఉన్న కుటుంబాల్లో ఈ సమస్య రావడం చాలా సాధారణమైతే.... రెండో కారణం పిల్లలు ఎప్పుడూ ఆరుబయట ఆడకుండా ఇన్–డోర్స్‌లోనే ఎక్కువగా గడపడం. ఆరుబయట ఆడుకునే పిల్లల్లో తక్కువే... నిజానికి ధరణినే కాదు... ఆ వయసు చిన్నారులు ఇప్పుడు ఆరుబయట ఆటలాడటం చాలా తక్కువ. గతంలో ఆ వయసు పిల్లలు ఆరుబయట విస్తృతంగా ఆడుతుండేవాళ్లు. ‘‘ఆడింది చాలు. ఇక లోపలికి రండి. కాళ్లూ చేతులు కడుక్కుని ఏదైనా కాస్తంత తిని చదువుకోండి’’ అంటూ అమ్మలో లేదా ఇంట్లోని పెద్దవాళ్లో కోప్పడుతుండటం మామూలే. దాదాపు నాలుగైదు దశాబ్దాల కంటే ముందు పిల్లలు ఇలా మట్టిలో ఆడుకుంటూ ఉండేవారు. కారణమేమిటో ... ఎందుకో కూడా తెలియదు గానీ ఇలా ఆరుబయట బాగా ఆటలాడుకునే పిల్లల్లో దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించని ‘షార్ట్‌సైటెడ్‌నెస్’ అని పిలిచే మయోపియా చాలా తక్కువ. బయట ఆటలాడకుండా ఇలా ఎక్కువసేపు ఇన్–డోర్స్‌లోనే ఉండే పిల్లలకూ ఇలా మయోపియా ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందో పెద్దగా తెలియదు.సరిదిద్దడమిలా... మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్) అనేది రిఫ్రాక్టివ్ సమస్య. అంటే కాంతి కిరణాలు రెటీనాపై కాకుండా కనుగుడ్డులో కాస్తంత లోపలే కేంద్రీకృతం కావడంతో ఈ సమస్య వస్తుంది. కంటి అద్దాలతో చాలా సులువుగా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. కంటి అద్దాలను అంతగా ఇష్టపడనివాళ్లు కాంటాక్ట్ లెన్స్ కూడా ధరించవచ్చు... గానీ వాటిని సంరక్షించుకోవడం మళ్లీ ప్లెయిన్ కళ్లజోడు వాడటం మంచిది. ఇక ఒక వయసు వచ్చాక కళ్లజోడు ధరించడం అంతగా ఇష్టపడకపోతే... పద్ధెనిమిదేళ్లు దాటాక ‘లేసిక్’ అనే శస్త్రచికిత్స (రిఫ్రాక్టివ్ సర్జరీ) ద్వారా కూడా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పిల్లలు స్కూల్లో బోర్డుగానీ లేదా తమ స్కూలు బస్సు తాలూకు బోర్డుగానీ లేదంటే దూరపు వస్తువులుగానీ స్పష్టంగా కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు తప్పక వెంటనే స్పందించాలి. మరీ ఆలస్యం చేసిన పిల్లల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుండటంతో పాటు అరుదుగానైనా మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశాలుంటాయి. పిల్లలు స్క్రీన్ చూసే సమయం తగ్గించండి...ఇవాళ టీవీ లేని ఇల్లంటూ లేదు. అంతేకాదు... కంప్యూటరూ, ల్యాప్‌టాప్ వంటివి లేని ఇళ్లు కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇక మొబైల్ అయితే పిల్లలకూ లేకుండా ఉండటం లేదు. టీవీ, కంప్యూటరూ, మొబైల్... ఇలా అది ఏ స్క్రీన్ అయినప్పటికీ దాన్నుంచి వెలువడే కాంతితో చిన్నారుల కళ్లను కాపాడుకోవడం ఎలాగో చూద్దాం. → పిల్లలు టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను చూసే వ్యవధిని తల్లిదండ్రులు విధిగా తగ్గించాలి. అంటే రోజూ కొద్దిసేపు మాత్రమే వాళ్లను టీవీ, కంప్యూటర్, మొబైల్‌లను చూడనివ్వాలి. → మొబైల్ లేదా కంప్యూటర్ కాంతి అదేపనిగా కంటిని తగులుతూ ఉండకూడదు. కాసేపు స్క్రీన్ చూశాక కనీసం కొద్ది నిమిషాల పాటు కంటికి రెస్ట్ ఇవ్వాలి. → గదిలో చీకటిగా ఉన్నప్పుడు టీవీ వెలుతురులో లేదా కంప్యూటర్ వెలుతురులో పిల్లలు చదవడానికి ప్రయత్నించకూడదు. → టీవీ లేదా కంప్యూటర్ను మసక చీకట్లో చూడటం సరికాదు. అవి ఆన్‌లో ఉన్నప్పుడు గదిలో లైట్ వెలుగుతూ ఉండాలి. చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు కంప్యూటర్/మొబైల్ స్క్రీన్ నుంచి లేదా టీవీ నుంచి వెలువడే కాంతి కంటికి హాని చేసే అవకాశం ఎక్కువ. – యాసీన్ -
పర్యటన రద్దు.. హైదరాబాద్‌కు నిమ్మగడ్డ
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వైఎస్సార్ జిల్లా పర్యటన చివరి నిముషంలో వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సోమవారం సంబంధిత జిల్లాల అధికారులతో ఎస్ఈసీ సమీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆయనకు కంటి ఇన్ఫెక్షన్ కారణంగా పర్యటన రద్దు అయ్యింది. కంటి పరీక్షల కోసం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి నిమ్మగడ్డ వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో తొలి విడతలో 2,723 గ్రామ పంచాయతీల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ఆదివారం రాత్రి 7.30 గంటలతో ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. (చదవండి: పిచ్చి పీక్స్‌కు.. తుగ్లక్‌ను మరిపిస్తున్న నిమ్మగడ్డ) (కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు) -
కనుపాపకు ఎంత కష్టం
రోజూ నగరంలో కంటి సమస్యలతో వైద్యుల వద్దకు వెళుతున్న వారు 5,000 ఇందులో గాలి, రసాయన కాలుష్యాల కారణ బాధితులు 500 ఎక్కువగా ఇలాంటి బాధితులు 18 నుంచి 35 ఏళ్ల లోపువారే కాలుష్యం వల్ల దీర్ఘకాలిక కంటి సమస్య బారినపడ్డ బాధితుల సంఖ్య ఏటా 15 వేలు. ఇందులో అబ్బాయిలే 70 శాతం నయనం ప్రధానం. కానీ నగర జీవి కంటిపాపకు కష్టకాలమొచ్చింది. ఇది ఎంత వేగంగా అంటే మనకు ఏం జరుగుతోందో తెలిసే లోపే చూపు మసకబారుతోంది. ఇంటికెళితే చికాకు. ఆఫీసుకొస్తే అలసట. మానసిక ఒత్తిడి. ప్రయాణంతో కంటిపాపపై ఒత్తిడి. ఇదీ నగరంలో లక్షలాది మంది యువత పరిస్థితి. కంటి బాధితులు మిగతా ఏ రంగంలో పెరగనంతగా పెరుగుతున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వారిని తిన్నగా అంధత్వం దిశగా నెడుతోంది. ముప్ఫై దాటాయో లేదో కళ్లకు అద్దాలు. నలభై దాటితే చత్వారం. యాభైలో మరింత దారుణం. ప్రతి వందమంది కంటి బాధితుల్లో నగరంలో పొగలు, దుమ్మూ ధూళితో వస్తున్న కంటివ్యాధుల బాధితులు కనీసం 15 శాతం దాటారు. పొగల సెగలు కంటిపాపను ఛిద్రం చేస్తున్న తీరుపై డాక్టర్లే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా కంటిని కాపాడుకోవచ్చునని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా.రవికుమార్‌రెడ్డి చెబుతున్నారు. ఇలా మొదలవుతున్నాయ్ కంటిపాప కష్టాలు నగరంలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు కంటి వ్యాధులకు గురవుతున్నారు. {పధానంగా రెండు రకాల ఇబ్బందులు కంటివ్యాధులకు కారణమవుతోంది వెజిటబుల్ మెటీరియల్...అంటే వృక్ష సంబంధిత లేదా జంతు సంబంధిత రేణువులు. వాహనాల నుంచి వచ్చే రసాయన ధూళి. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ తదితరములు ఈ రెండు రకాల కారణాల వల్ల ప్రతి 100 మందికీ 15 మంది ఏడాదికి రెండు మూడు సార్లు కంటి వైద్యుల దగ్గరకు వెళుతున్నారు ప్రధానంగా వీటి వల్ల కళ్లకలక, ఇన్ఫెక్షన్, కార్నియల్ అల్సర్ తదితరములు వస్తున్నాయి కళ్లు ఎరుపుగా మారి, నీళ్లు కారడం మొదలవుతోంది కళ్లలో ఇరిటేషన్, అలర్జీ, పొడిబారడం జరుగుతోంది. కొన్నేళ్ల తరువాత మసకబారుతాయి క్రమంగా కంటిచూపు తగ్గుతూ వస్తుంది. ఎయిర్, కెమికల్ పొల్యూషన్ వల్ల కంటిలో నల్లగుడ్డుపై ఎరిటియం అనే కండరంపెరుగుతుంది. ఇది తిన్నగా చూపును తగ్గిస్తుంది కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే... - ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవాలి - అద్దంతో కూడిన హెల్మెట్ కవర్‌ను ధరించడం మంచిదే - ఇంటినుంచి ఆఫీసుకు వెళ్లగానే మంచినీళ్లతో కళ్లను కడుక్కోవడం మంచిది - అలాగే ఆఫీసునుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచినీళ్లతో కళ్లను కడుక్కోవాలి - ప్రయాణం చేసి కొద్దిగా కంటికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లూబ్రికెంట్ డ్రాప్స్ వేసుకోవచ్చు - పదే పదే కళ్లతో బాధపడుతూంటే వైద్యుల సలహా మేరకు యాంటీబయోటిక్ చుక్కలు వేసుకోవచ్చు. - ద్విచక్రవాహనంపై తిరిగే వారు ప్రతి ఆరుమాసాలకు కంటి వైద్యులను సంప్రదించడం మంచిది - ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలను కళ్లద్దాలు, హెల్మెట్లు లేకుండా ముందువైపు కూర్చోపెట్టద్దు. - ఎక్కువగా పెద్ద చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కళ్లకు ఎఫెక్ట్ అయ్యే పొగలు వెలువడుతాయి. వీలైనంత వరకూ ఇలాంటి చౌరస్తాల గుండా వెళ్లడం తగ్గించాలి - డా. రవికుమార్‌రెడ్డి కంటివైద్య నిపుణులు, మెడివిజన్ హాస్పిటల్ మెహిదీపట్నం