చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు జిల్లాలో కొత్తగా మూడు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు నగరంలోని గూలింగ్స్‌పేట, పాలసముద్రం మండలం ఆముదాల, జీడీ నెల్లూరు మండలం, చిన్నమిట్టపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది.
పారిశుద్ధ్య లోపం కారణంగానే ఈ వ్యాధి విజృంభిస్తోందని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.


