ఏపీ: విలీన గ్రామాల్లోని టీచర్ల బదిలీల షెడ్యూల్‌

Schedule Of Transfers Of AP Teachers In Merged Villages - Sakshi

సాక్షి, అమరావతి: మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్య డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈనెల 6 నుంచి 21వ తేదీ మధ్య వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు సిద్ధం కావాలన్నారు.

గత ఏడాది ఉపాధ్యాయుల సాధారణ బదిలీల సమయంలో మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్నందున తమను మునిసిపల్‌ ఉపాధ్యాయులుగా పరిగణించాలని 400 మందికిపైగా జెడ్పీ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో వీరి బదిలీలు నిలిచిపోయాయి. కోర్టు ఉపాధ్యాయుల కేసులను కొట్టేసి, బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్య అధికారులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరి బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేశారు.

షెడ్యూల్‌ ఇలా..
6వ తేదీ: యాజమన్య, కేటగిరీ, సబ్జెక్టుల     వారీగా ఖాళీల ప్రదర్శన
7వ తేదీ: తాత్కాలిక సీనియారిటీ 
జాబితా ప్రదర్శన
8, 9 తేదీలు:    ప్రకటించిన     జాబితాలో అభ్యంతరాల అప్‌లోడ్, ఆధారాలు 
విద్యాశాఖ అధికారులకు అందజేత
13, 14 తేదీలు: అభ్యంతరాల 
పరిశీలన, ఆమోదం
15వ తేదీ: తుది సీనియారిటీ జాబితా ప్రకటన
16, 17 తేదీలు: వెబ్‌ ఆప్షన్‌ల స్వీకరణ
21వ తేదీ:     వెబ్‌సైట్‌లో బదిలీ ఆర్డర్ల 
ప్రదర్శన, డౌన్‌లోడింగ్‌.

ఇవీ చదవండి:
ఏపీ: ఈ–కేవైసీ గడువు 15 వరకు పొడిగింపు  
లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..!

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top