సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం

Satya Nadellas Wife Donates Rs 2 Crore To Anantapur Ecology Center - Sakshi

సాక్షి, అనంతపురం : మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ఔదార్యం చూపారు. రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం ఆమె 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం యాక్షన్‌ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్‌కు ఈ విరాళాన్ని అనుపమ అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అనుపమ నాదెళ్లను అభినందించారు.  (నాన్నా.. నువ్వే నా దిక్సూచి: నాదెళ్ల)

దాతలు ఇచ్చిన ఆర్ధిక సాయంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ వైవీ మల్లారెడ్డి తెలిపారు. కాగా అనుపమ తండ్రి వేణుగోపాల్‌ ఐఏఎస్‌ అధికారి. పలు ప్రాంతాల్లో ఆయన కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో తండ్రి ఉద్యోగరీత్యా ఆమె కూడా దేశమంతా పర్యటించారు. అప్పుడే అక్కడ సమస్యలను తెలుసుకున్న అనుపమ తన వంతు సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top