కేబినెట్‌ కళ్లుగప్పి ఖజానాకు కన్నం  | Sand Irregularities During Tdp Regime | Sakshi
Sakshi News home page

కేబినెట్‌ కళ్లుగప్పి ఖజానాకు కన్నం 

Published Sat, Nov 11 2023 7:54 AM | Last Updated on Sat, Nov 11 2023 3:40 PM

Sand Irregularities During Tdp Regime - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఇసుక దోపిడీకి బరి తెగించిన మాజీ సీఎం చంద్ర­బాబు ఉచిత విధానం ముసుగులో నిర్భీతిగా అన్ని విధి విధానాలను ఉల్లంఘించారు. ఒక­పక్క ఇసుక ఉచితమంటూనే మరోపక్క అక్రమ తవ్వకాలకు భారీ జరిమానాలంటూ మెలిక పెట్టారు. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలను తుంగలో తొక్కడంతోపాటు కేబినెట్‌ను చీకట్లో ఉంచి మరీ దోపిడీకి తెరతీశారు.

కేబినెట్‌ ఆమోదం లేకుండా మొదట ఓ మెమో.. తరువాత జీవో ద్వారా ఇసుక దందాకు తెగబడ్డారు. ఇప్పుడు పారదర్శకంగా ఇసుక తవ్వకాలను నిర్వహి­స్తుం­డటంతో రాష్ట్ర ప్రభుత్వానికి రెండేళ్లలో దాదాపు రూ.770 కోట్ల మేర ఆదాయం సమ­కూరింది. అంటే గత సర్కారు హయాంలో దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి ఖజా­నాకు చంద్రబాబు గండి కొట్టినట్లు స్పష్టమ­వుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆ ఆదాయం అంతా పచ్చ ముఠాలకు చేరిపో­యింది. అంతేకాకుండా ఉచితం ముసుగులో టీడీపీ నేతలు విచ్చలవిడిగా 

దోపిడీ పర్వం సాగించారు. వీటిని అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిపై నాటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ విచక్షణా రహితంగా దాడులకు బరి తెగించారు. స్వయంగా నాటి సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం పక్కనే ఇష్టారాజ్యంగా ఇసుక లూటీ జరుగుతున్నా కళ్లు మూసుకుని కూర్చోవడాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీవ్రంగా తప్పుబడుతూ భారీ జరిమానా సైతం విధించింది. రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని ఆక్షేపించినా చంద్రబాబు చలించలేదు. ఈ ఇసుక దోపిడీ కేసులో సీఐడీ తీగ లాగుతుంటే పచ్చ ముఠాల డొంక కదులుతోంది.

ఆది నుంచి కన్ను
2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక రీచ్‌లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించినట్లు చంద్రబాబు కథ నడిపారు. మహిళా సమాఖ్యల ముసుగులో రెండేళ్ల పాటు భారీగా ఇసుక కొల్లగొట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 2016లో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రీచ్‌లను వేలం వేసి ఇసుక విధానాన్ని రూపొందించారు. ఈమేరకు కేబినెట్‌ తీర్మానం చేసి 2016 జనవరి 1న జీవో 19 ఇవ్వగా అదే ఏడాది జనవరి 15న జీవో 20 వెలువడింది. ఈ విధానం ద్వారా కూడా మిగిలిన మూడేళ్లలో తాను ఆశించిన  మేరకు ఇసుక దోపిడీ సాధ్యం కాదని భావించిన చంద్రబాబు రెండు నెలల్లోనే టెండర్ల ద్వారా ఇసుక రీచ్‌ కేటాయింపు విధానాన్ని పక్కన పెట్టేశారు. 

పచ్చ ముఠాలకే ఉచితం
రాష్ట్రంలో ఇసుకను ప్రజలందరికీ ఉచితంగా ఇస్తున్న­ట్లు చంద్రబాబు నమ్మబలికారు. అందుకోసం కేబినెట్‌ ఆమో­­దం లేకుండా జారీ చేసిన మెమో 3066, జీవో 43 మధ్యలో మరో జీవో కూడా తెచ్చారు. 2016 మార్చి 14న జారీ చేసిన ఆ జీవో ద్వారా అక్రమ ఇసుక తవ్వ­కాలను అరికట్టేందుకు భారీ జరిమానాలను నిర్దేశించా­రు. ఇసుక ఉచితం అన్నప్పుడు ఇక అక్రమ తవ్వకాలు అనే మాటే ఉత్పన్నం కాకూడదు కదా? అంటే ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు కనికట్టు చేశార­న్న­ది స్పష్టమైంది.

ఆ పేరుతో కేవలం చంద్రబాబు బినా­మీలు, సన్నిహితులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యే­లు ఇసు­­క రీచ్‌లను గుప్పిట్లో పెట్టుకున్నారు. మూడేళ్ల­పా­టు దోపీడికి పాల్పడ్డారు. ఇతరులు ఇసుక రీచ్‌ల జోలి­కి రాకుండా కట్టడి చేసేందుకే జీవో 35 తెచ్చారు. కొస­మె­­రుపు ఏమిటంటే జీవో 35కు కూడా కేబినెట్‌ ఆమో­దం లేదు. ఉచిత ఇసుక విధానం పేరుతో తెచ్చిన మెమో 3066, అనంతరం జారీ చేసిన జీవోలు 35, 43లకు కేబినెట్‌ ఆమోదం లేదన్నది నిర్ధారణ అయింది. వాటికి సంబంధించిన నోట్‌ ఫైళ్లు అటు ఏపీఎండీసీలోగానీ ఇటు గనుల శాఖ, జలవనరుల శాఖ కార్యాలయా­ల్లో­గా­నీ లేవని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇసుక దోపిడీ కోసం చంద్రబాబు పక్కాగా సాగించిన పన్నాగంపై పూర్తి ఆధారాలతో  సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

కేబినెట్‌ను చీకట్లో ఉంచి.. ఉచిత ఇసుక విధానంతో దోపిడీ
ఎంత ఇసుక అందుబాటులో ఉంది? ఎంత తవ్వుతున్నాం? ఎంతకు అమ్ముతున్నాం? అనే ప్రాథమిక లెక్కలతో కూడా నిమిత్తం లేకుండా యథేచ్ఛగా కాజేసేందుకు ఈ విధానాన్ని తెచ్చారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని, జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలను తుంగలోకి తొక్కారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే కథ నడిపారు. అందుకోసం 2016 మార్చి 4న మెమో 3066 జారీ చేశారు. అది కూడా అప్పటికి రెండు రోజుల ముందు నుంచి అంటే 2016 
మార్చి 2 నుంచే ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. అప్పటివరకు కేబినెట్‌ ఆమోదంతో అమలులో ఉన్న ఇసుక విధానాన్ని తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మెమో జారీ చేశారు.

ఈ మెమోకు కేబినెట్‌ ఆమోదం లేదు. అంటే కేబినెట్‌ ఆమోదంతో రూపొందించిన విధానాన్ని పక్కనపెట్టి అడ్డదారిలో మెమో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అక్రమంగా ఇసుక తవ్వకాలపై భారీ జరిమానాలు విధించేందుకు విధివిధానాలను నిర్దేశిస్తూ 2016లో గత సర్కారు జీవో 35 జారీ చేసింది. రెండు నెలల తరువాత అంటే 2016 ఏప్రిల్‌ 6న జీవో 43 వెలువరించి అప్పటివరకు మెమో ద్వారా అమలు చేస్తున్న  ఉచిత ఇసుక  విధానానికి రాజముద్ర వేసింది. విడ్డూరం ఏమిటంటే ఆ జీవో 43కు కూడా కేబినెట్‌ ఆమోదం లేదు. కేబినెట్‌ ఆమోదం లేకుండానే ఉచిత ఇసుక విధానాన్ని దొడ్డిదారిలో తెచ్చి ఇసుక దోపిడీకి చంద్రబాబు తెరతీశారు.
చదవండి: రోత పుట్టించే రాతలు రాయడంలో పచ్చమీడియా రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement