విశాఖ లీగల్: రాష్ట్రంలోని ప్రత్యేక న్యాయస్థానాల న్యాయమూర్తులు, సిబ్బందికి ఆదివారం రాత్రి వరకు కూడా జీతాలు విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలను విడుదల చేయకపోవడంతో న్యాయశాఖ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. ఎస్సీ, ఎస్టీ కోర్టులు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, ఇతర ప్రత్యేక కోర్టుల సిబ్బందికి ఈనెల జీతాలు అందలేదు.
దీంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు విడుదల చేయాలని సిబ్బంది కోరుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,000 నుంచి 3,000 మంది సిబ్బందికి ప్రతీనెలా జీతాలు సక్రమంగా అందడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 7వ తేదీ నాటికి కూడా జీతాలు అందలేదని విశాఖలోని న్యాయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు.


