ఏదో మారిపోయిందని అనుకోవద్దు.. ఎమ్మెల్సీ ఫలితాలపై స్పందించిన సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments On MLC Results - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైఎస్సార్‌సీపీని బాగా ఆదరించారని, అలాగే ఫలితంతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని శనివారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో పేర్కొన్నారు. 

ఓట్ల బండిల్‌లో ఏదో గందరగోళం జరిగింది.కౌంటింగ్‌లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిద్ది అని అనుకోవద్దంటూ ప్రతిపక్ష టీడీపీకి చురకలంటిచారాయన. అలాగే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్‌ మాత్రమేనని గుర్తు చేశారు.  ఇవి సొసైటీని రిప్రజెంట్‌ చేసేవి కావు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు.  పీడీఎఫ్ ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీకి వెళ్లాయి. ఈ ఫలితంతో.. టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారాయన.

ఈ ఎన్నికలు  ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవు. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదు. అలాగే.. ఈ ఫలితాలను మేము హెచ్చరిక గా భావించడం లేదు. ఎందుకంటే.. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదు. అసలు ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా అపాదిస్తారు? అని టీడీపీని, యెల్లో మీడియాను ప్రశ్నించారాయన.  ‘‘మేము అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రులు ఓటర్ల లో ఎక్కువగా లేరు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేశాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేస్తోంది. తెలంగాణ తరహాలోనే ప్రయత్నాలు టిడిపి చేయొచ్చు అని తెలిపారు సజ్జల. 

అయితే.. మొదటిసారి ఉపాధ్యాయుల స్థానాలు గెల్చుకున్నామని చెప్పిన ఆయన.. ఉపాధ్యాయులు తమను బాగా ఆదరించారని చెప్పారు. ‘‘తొలిసారి టీచర్‌ ఎమ్మెల్సీలు గెలవడం మాకు పెద్ద విజయం. మా ఓటర్లు వేరే ఉన్నారు. మాకు సంతృప్తికరంగానే ఓట్లు వచ్చాయి. అలాగని.. ఈ ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపవు’’ అని మరోసారి స్పష్టం చేశారాయన.

ఇదీ చదవండి: రెండు సీట్లకే ఎగిరి గంతేయడం టీడీపీ స్టైల్‌!

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top