ఫేస్‌బుక్‌లో అభ్యర్థన.. ఆర్టీసీ బస్సు ఏర్పాటు

RTC bus arrangement with Request on Facebook - Sakshi

సాక్షి, అమరావతి: ఫేస్‌బుక్‌లో పోస్టు ద్వారా అభ్యర్థించిన వెంటనే ప్రయాణికులకు ఓ బస్సు సర్వీసును ఏర్పాటు చేసి ప్రజా సేవే తమ లక్ష్యమని ఆర్టీసీ నిరూపించిన ఆసక్తిక­ర­మైన ఘటన కృష్ణాజిల్లాలోని పామ­ర్రులో జరి­గింది. 40 మంది ప్రయాణికులు మంగళ­వారం రాత్రి పామర్రు నుంచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల వెళ్లాల్సి ఉంది.

వీరిలో ఒకరు తమకు బస్సు ఏర్పాటు చేయగలరా అని ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) కె.ఎస్‌.బ్రహ్మానంద­రెడ్డిని ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా అభ్యర్థించారు. దీని­పై వెంటనే స్పందించిన బ్రహ్మానందరెడ్డి గుడివాడ బస్‌ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఆ ప్రయాణికులకు పామర్రు నుంచి నెల్లిమర్లకు ప్రత్యేకంగా బస్సు సర్వీసు ఏర్పాటు చేశారు.

ఆ 40 మంది ప్రయాణికులు ఆ బస్సులో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానమైన నెల్లిమ­ర్లకు బుధవారం ఉదయం చేరుకు­న్నారు. అడ­గంగానే సాయం చేసిన ఆర్టీసీ సేవలను అభినందించారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top