విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం | rtc bus accident at vizag dwaraka rtc complex | Sakshi
Sakshi News home page

విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం

Aug 11 2025 5:23 PM | Updated on Aug 11 2025 6:11 PM

rtc bus accident at vizag dwaraka rtc complex

 సాక్షి,విశాఖ: ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిలవ్వడంతో బస్సు ప్రయాణికురాలిపైకి దూసుకెళ్లింది.

సోమవారం సాయంత్రం విశాఖ ద్వారాక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బ్రేకులు ఫెయిల్ అయిన విశాఖ- పలాస ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ప్లాట్‌ఫారం మీద ఉన్న ప్రయాణికులపై దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో మహిళ మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రేకులు ఫెయిలయ్యి ప్రమాదం జరిగిందా? లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement