పంచాయతీరాజ్‌లో పదోన్నతులు | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌లో పదోన్నతులు

Published Fri, Sep 1 2023 4:44 AM

romotions in Panchayat Raj - Sakshi

సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్‌ శాఖలో పనిస్తున్న ఎంపీడీవోలకు డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ (డీఎల్‌డీవో) గా, మరో 167 గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఈవోపీఆర్‌డీలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022–23 సంవత్సరానికి సంబంధించి 2007 గ్రూపు–1 నోటిఫికేషన్‌ ద్వారా ఎంపీడీవోలుగా ఉద్యోగాలు పొందిన మొత్తం 66 మంది సీనియారిటీ జాబితాను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) ఆమోదం తెలిపినట్టు పంచాయతీరాజ్‌ శాఖ ఇన్‌చార్జి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం వెల్లడించారు.

కాగా.. 66 మంది ఎంపీడీవోల సీనియారిటీ జాబితాల్లో 14 మందిపై వివిధ శాఖాపరమైన అభియోగాలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. సీనియారిటీ జాబితాలో శాఖాపరమైన అభియోగాలు పెండింగ్‌ లేని ఎంపీడీవోల పదోన్నతులకు పూర్తి స్థాయిలో అర్హులుగా వివరించారు. కాగా.. పూర్వం మేజర్‌ గ్రామ పంచాయతీలో ఎగ్జి­క్యూటివ్‌ అధికారులు(ఈవో)గా, గతంలో విలేజి డెవలప్‌మెంట్‌ అధికారులు(వీడీవో)గా పనిచేసి ప్రస్తుతం గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్న వారితోపాటు మండల, జిల్లా పరిషత్‌ కార్యాలయాలు, డీపీవో కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న 167 మందికి ఈవోపీఆర్‌డీలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ సూర్యకుమారి ఆమోదం తెలిపారు.

ఈవోపీఆర్‌డీలుగా పదోన్నతులు కల్పించినందుకు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్‌ ఒక ప్రకట­నలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులకు ధన్య­వాదాలు తెలిపారు. 

Advertisement
Advertisement