తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలు.. ప్రయాణీకులకు గాయాలు | Road Accidents At Tirumala Ghat Roads | Sakshi
Sakshi News home page

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాదాలు.. ప్రయాణీకులకు గాయాలు

Apr 23 2025 11:14 AM | Updated on Apr 23 2025 11:59 AM

Road Accidents At Tirumala Ghat Roads

సాక్షి, తిరుమల: తిరుమల ఘాట్‌ రోడ్డులో వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒక ప్రమాదంలో కారు బోల్తా, మరో ప్రమాదంలో బస్సులు ఢీకొనడంతో పలువురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాల కారణంగా ఘాట్‌ రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

వివరాల ప్రకారం.. తిరుమల ఘాట్‌ రోడ్డులో బుధవారం ఉదయం రెండు వరుస ప్రమాదాలు జరిగాయి. మొదటి ఘాట్ రోడ్డు 33వ మలుపు వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రి కి తరలించారు. ఇక, రెండో ఘాట్‌ రోడ్డులో మూడు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సుల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక, ఇటీవల కాలంలో ఘాట్‌ రోడ్డులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement