బాబు హయాంలో లక్షన్నర మంది విద్యార్థుల డ్రాపౌట్లు..! | Rising Student Dropouts During Chandrababu Govt Tenure | Sakshi
Sakshi News home page

బాబు హయాంలో లక్షన్నర మంది విద్యార్థుల డ్రాపౌట్లు..!

Apr 1 2026 7:11 PM | Updated on Apr 1 2026 8:10 PM

Rising Student Dropouts During Chandrababu Govt Tenure

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుందని కేంద్రం వెల్లడించింది. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో లక్షన్నర విద్యార్థులు డ్రాపౌట్లు అయినట్ల తెలిపింది. రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమాధానం ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని.. 12 తరగతి వరుకు విద్యార్థుల గణాంకాలు కేంద్రం వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరంలో 36,43,083 విద్యార్థులు కాగా.. 2025-26 విద్యా సంవత్సరంలో 34,93,449కి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఏడాది వ్యవధిలో 1,49,634 విద్యార్థులు స్కూళ్ల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు.

గవర్నమెంట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తొలగించడం, సీబీఎస్ఈ సిలబస్ తొలగింపు, విద్యావ్యవస్థను సరిగా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు గుడ్ బై చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement