‘జగనన్న సారథ్యంలో చేనేతకు పునరుజ్జీవం’

Handloom Industry Back On Track With CM YS Jagan's Support - Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలో చేనేతకు పునరుజ్జీవం వచ్చిందని వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు  స్పష్టం చేశారు.  కొన్నేళ్లుగా ప్రాభవం కోల్పోయిన చేనేతకు సీఎం జగన్‌ ఎంతో చేయూతను అందించారన్నారు. ఈరోజు(ఆగస్టు7) చేనేత దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ఎన్నికల ముందు చేనేత వర్గాలకు ఇచ్చిన హామీలన్నింటిని సీఎం జగన్ అమలు చేశారు.మగ్గం వున్న ప్రతి చేనేత కార్మికుడికి వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పేరిట ఏటా రూ.24 వేలు ఇస్తున్నారు. గత డిసెంబరులో తొలి విడత నేతన్న నేస్తం పంపిణీ చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్నెల్లు ముందుగానే రెండో విడత నేతన్న నేస్తం పంపిణీ చేశారు. ఆప్కోకు పెండింగ్‌ బకాయిలను విడుదల చేసి చేనేత రంగంపై చిత్తశుద్ధిని సీఎం జగన్ చాటుకున్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ మాస్కుల పంపిణీ ద్వారా ఆప్కోకు నేతన్నలకు ఎంతగానో ప్రయోజనం చేకూరింది’ అని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top