స్టాఫ్‌ నర్సు పోస్టుల ఫైనల్‌ మెరిట్‌ జాబితా విడుదల | Release Of Final Merit List Of Staff Nurse Posts In AP | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌ నర్సు పోస్టుల ఫైనల్‌ మెరిట్‌ జాబితా విడుదల

Jan 9 2023 9:54 AM | Updated on Jan 9 2023 9:56 AM

Release Of Final Merit List Of Staff Nurse Posts In AP - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీలో భాగంగా ఫైనల్‌ మెరిట్‌ జాబితాను జోన్‌– 2, 3, 4లలో విడుదల చేశారు. జోన్‌–1లో ఫైనల్‌ మెరిట్‌ జాబితా విడుదల కావాల్సి ఉంది. 957 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి గత నెల మొదటి వారం­లో వైద్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నాలుగు జోన్‌లలో 40 వేల మందికి పైగా అభ్య­ర్థులు దర­ఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా జోన్‌–2లో 12,295 మంది ఉన్నారు. ఫైనల్‌ మెరిట్‌ జాబితా వెలు­వడిన నేపథ్యంలో ఈ వారంలో ఎంపికైన అభ్య­ర్థుల జాబితాలను విడుదల చేసి, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement