నిండు జీవితానికి రెండు చుక్కలు.. ఏపీలో పోలియో చుక్కల కార్యక్రమం

Pulse Polio Program In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులకు ఆదివారం నుంచి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. నాలుగు రోజుల పాటు(బుధవారం వరకు) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52,93,832 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం 37,969 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 1,51,876 మంది వ్యాక్సినేటర్‌లు ఇందులో పాల్గొంటున్నారు.

చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? 

అలాగే సోమవారం నుంచి ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేసేందుకు 75,938 బృందాలను ఏర్పాటు చేశారు. హై రిస్క్‌ ప్రాంతాల కోసం 1,374 మొబైల్‌ బృందాలు నియమించారు. ఇప్పటికే 13 జిల్లాలకు 66, 95,000 డోసులను వైద్య, ఆరోగ్య శాఖ సరఫరా చేసింది.  వైద్య, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో చివరిసారిగా 2008 జూలై 16న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పోలియో కేసు నమోదైంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్క పోలియో కేసు నమోదు కాలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top