కరోనాతోనే మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్‌ మృతి

Prisoners Tested Positive For Corona Include With Om Prakash in Visakha Central Jail - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ సెంట్రల్‌ జైల్లో కరోనా వైరస్‌ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓం ప్రకాశ్‌ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. యన మృతదేహానికి కరోనా టెస్ట్‌ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు పాజిటివ్‌గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్‌ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. (మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top