AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ

PRC Steering‌ Committee Comment on AP Teachers Union - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల బండారం పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ బయటపెట్టింది. హెచ్‌ఆర్‌ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని.. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. అదనపు పెన్షన్‌, సీసీఏ కూడా వచ్చిందన్నారు.

చదవండి: ఆంధ్రప్రదేశ్‌ కోణంలో ఇది చెత్త బడ్జెట్‌: విజయసాయిరెడ్డి

‘‘ఉపాధ్యాయ సంఘాలు ప్రతి అంశంలో చర్చల్లో పాల్గొన్నాయి. అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు చర్చల నుంచి బయటకు రావాల్సింది. ఫిట్‌మెంట్‌పై అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె విరమించుకుందామని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయని’’ పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు.

ఉపాధ్యాయ ముసుగులో దుష్ఫ్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నిర్ణయంలోనూ 20 మంది అభిప్రాయం మేరకే ముందుకెళ్లామన్నారు. మెరుగైన ప్రయోజనం వచ్చింది కాబట్టే సమ్మె విరమించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు పక్కన కూర్చుని మాట్లాడలేదా? గ్రాట్యుటీ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై చర్చ జరిగినప్పుడు మీకు తెలియదా?. అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ ఉపాధ్యాయ సంఘాలను పీఆర్సీ జేఏసీ నేతలు నిలదీశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top