YSRCP Plenary 2022: అన్నా.. నీ ఆహ్వానం గుండెల్లో పదిలం

సాక్షి,అమరావతి: సంక్షేమం.. అభివృద్ధి.. జోడు గుర్రాలుగా పాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో ఎంతటి స్థానం సంపాదించుకున్నారో చెప్పేందుకు ఈ ఫొటో ఓ తార్కాణం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీకి ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు.
తొట్టంబేడు మండలకేంద్రంలోని అరుంధతివాడకు చెందిన వెంకటేశ్వరికి కూడా ఆహ్వానపత్రం అందింది. ఆహ్వాన పత్రికపై సీఎం జగన్ నిలువెత్తు ఫొటో చూడగానే పట్టరాని సంతోషానికి గురైంది. నిలువనీడలేని మాకు ఓ గూడు కట్టించి ఇస్తున్న దేవుడు జగనన్న అంటూ ఉద్వేగానికి గురయింది. ‘నా భర్తకు వచ్చే చాలీచాలని కూలీతో ఇద్దరు పిల్లలున్న మాకు రోజు గడవడమే కష్టం.. అటువంటిది సొంతిల్లు అనేది తీరని కలే.. ఆ కలను నెరవేరుస్తున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. అందుకే దేవుడిచ్చిన అన్న పంపిన ఈ ఆహ్వానాన్ని ఫ్రేమ్ కట్టించుకుని చిరకాలం గుర్తుగా ఉంచుకుంటాం’ అని చెప్పింది.
సంబంధిత వార్తలు