ప్రేమించి వంచించాడు.. పెళ్లంటే పొమ్మన్నాడు.. | POCSO case On 18year Young Boy In West Godavari | Sakshi
Sakshi News home page

ప్రేమించి వంచించాడు.. పెళ్లంటే పొమ్మన్నాడు..

Feb 6 2025 1:01 PM | Updated on Feb 6 2025 1:16 PM

POCSO case On 18year Young Boy In West Godavari

రాజానగరం: ప్రేమించానన్నాడు.. వంచించాడు.. పెళ్లి మాటెత్తితే కాదు పొమ్మన్నాడు. 16 ఏళ్ల బాలిక 18 బాలుడిపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం రాజానగరంలో జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలు ఇలా వున్నాయి. రాజానగరానికి చెందిన ఆ మైనర్లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నరేంద్రపురం కూడలిలో జులాయిగా తిరిగే ఆ బాలుడు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల నుంచి ఆమె వెంటపడేవాడు.

 చివరకు తనతోనే లోకం అనేలా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పదో తరగతి వరకు చదివిన ఆ బాలిక పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేయడంతో పెళ్లంటే తనకు ఇష్టం లేదని పొమ్మన్నాడు. దీనితో న్యాయం కోసం ఆ బాలిక స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లే కావడంతో పోలీసులు పోక్సో కేసుగా నమోదు చేసి, నార్త్‌ జోన్‌ డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఎస్సై నారాయణమ్మ దర్యాప్తు చేస్తున్నారు. 

అనుమానంతో.. భార్యను వెంటాడి మరీ..


 

Advertisement
 
Advertisement
Advertisement