జనసేన భేటీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది: పేర్ని నాని | Perni Nani Criticizes Janasena Political Affairs Committee | Sakshi
Sakshi News home page

జనసేన భేటీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది: పేర్ని నాని

Oct 30 2022 6:56 PM | Updated on Oct 30 2022 7:24 PM

Perni Nani Criticizes Janasena Political Affairs Committee - Sakshi

కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఇవాళ ఒక రాజకీయ పార్టీ(జనసేన) తన రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశం జరిపిందన్నారు..

సాక్షి, తాడేపల్లి: జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. దేశంలో ఏ చిన్న పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయాల వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజమని సూచించారు. కానీ, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఇవాళ ఒక రాజకీయ పార్టీ(జనసేన) తన రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశం జరిపిందన్నారు. ఈ సమావేశంలో ఒక వారం కింద చేసిన తీర్మానాలనే మళ్లీ కాపీ చేసి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా.. అరాచకాలు సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానం చేశారని మండిపడ్డారు.   

‘మహిళలపై దాడులు చేసే వారికి మద్దతిస్తూ తీర్మానం చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా పవన్‌ ర్యాలీ నిర్వహించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడారు. ప్రజల్లో సానుభూతి కోసం జనసేన తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు పవన్‌ను ఎందుకు పరామర్శించారు? మంత్రులపై దాడి చేసినందుకు పవన్‌ను చంద్రబాబు పరామర్శించారా? పోలీసులు నిర్బంధించారంటూ అవాస్తవాలు చెప్పారు. మంత్రులపై దాడి చేయడాన్ని పవన్‌ కనీసం ఖండించలేదు. చంద్రబాబు కోసం పవన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో మీ కార్యకర్తలు లేరా? ముద్రగడపై దాడి సమయంలో పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు? ’ అని జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పెర్నినాని. 

తుని రైల్వే ఘటనను వైఎస్‌ఆర్‌సపీకి ఆపాదిస్తున్నారని, తుని ఘటనలో యువకులపై కేసులు ఎత్తివేసింది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు పేర్ని నాని. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడానికి మద్దతు పలికి తర్వాత మాట మార్చిన ఘనత జనసేనదేనని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: అభివృద్ధే మన అజెండా.. ప్రతి ఒక్కరికీ సంక్షేమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement