పాపికొండలు: గోదావరి మధ్యలో నిలిచిపోయిన బోటు | Papikondalu Tour: Boat Stuck Middle Of The Godavari River | Sakshi
Sakshi News home page

పాపికొండలు: గోదావరి మధ్యలో నిలిచిపోయిన బోటు

Jun 13 2026 9:24 PM | Updated on Jun 13 2026 9:33 PM

Papikondalu Tour: Boat Stuck Middle Of The Godavari River

సాక్షి, పోలవరం: పాపికొండల పర్యటనలో గోదావరి మధ్యలో శ్రీలక్ష్మి బోటు నిలిచిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ  ఘటనతో పాపికొండల బోట్లు నిర్వహణలో డొల్లతనం బయటపడింది. గండి పోచమ్మ దేవస్థానం ప్రాంగణం నుండి పాపికొండలు విహారయాత్రకు 89 మంది పర్యాటకులతో బోటు బయలుదేరింది. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్ళే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు నిలిపివేశారు.

మరో బోటులో పర్యాటకులను బోటు యజమానులు తీసుకెళ్లారు. శ్రీలక్ష్మి బోటు ఆగిపోవడంతో జలశ్రీ బోటులో పర్యాటకులను వెళ్లారని నిర్వాహకులు చెబుతున్నారు. బోట్ నిలిచిపోవడంతో పాపికొండల బోట్లు ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోట్లో వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు.. తాత్కాలికంగా పాపికొండలు టూరిజం బోట్లను నిలిపివేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement