Ongole: ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు ఫుల్‌ డిమాండ్‌!

Ongole: Demand For Admissions In Govt Schools, No Seats Available - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది.


నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ స్కూళ్లకు మించి సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు జగనన్న విద్యా కానుక కిట్లు, మధ్యాహ్న భోజనం, తదితర కార్యక్రమాల అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లకు డిమాండ్‌ ఏర్పడింది. 


గతంలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు కాదు. ప్రస్తుతం అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులే ప్రభుత్వ పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు.


ఈ నెల మొదటి వారంలో పాఠశాలలు తెరవగా, రెండు వారాలు గడవకముందే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ప్రస్తుతం పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు క్లోజవడంతో వెనుదిరుగుతున్నారు. 

క్లిక్‌: మారనున్న కనిగిరి పట్టణ రూపు రేఖలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top