ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. | One Year Ban On Tobacco Gutka And Pan Masala In AP | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..

Published Mon, Dec 6 2021 9:17 PM | Last Updated on Tue, Dec 7 2021 8:24 AM

One Year Ban On Tobacco Gutka And Pan Masala In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్‌ మసాలాపై రేపటి నుంచి ఏడాది పాటు నిషేధం విధిస్తూ కుటుంబ సంక్షేమ,ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

చదవండి: మ్యూచువల్‌ బదిలీలకు ఏపీ సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నిటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతో నైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ చేయడం నేరమని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కాటమనేని భాస్కర్ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement