కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు లక్ష ఎకరాలు  | One Lakh acres for new power projects in AP | Sakshi
Sakshi News home page

కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు లక్ష ఎకరాలు 

Jul 27 2020 3:22 AM | Updated on Jul 27 2020 4:29 AM

One Lakh acres for new power projects in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ఎగుమతి విధానాన్ని (ఎక్స్‌పోర్ట్‌ పాలసీ) దృష్టిలో ఉంచుకుని 1,00,611.85 ఎకరాలను గుర్తించినట్టు సంప్రదాయేతర, పునరుత్పాదక వనరుల సంస్థ (నెడ్‌క్యాప్‌) ఎండీ రమణారెడ్డి తెలిపారు. ఈ భూమిని ఎకరా ఏడాదికి రూ.31 వేలకే లీజుకిస్తామన్నారు. రెండేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతామని చెప్పారు. ఈ మేరకు ‘సాక్షి’కి వివరించారు.  

► ఏపీలో 4 వేల మెగావాట్ల సౌరశక్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెకీ), 5 వేల మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు జాతీయ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ)లు ఆసక్తి చూపుతున్నాయి. 
► డెవలపర్‌ ఏ ప్రాంతంలోనైనా ప్లాంటు పెట్టుకోవచ్చని, ఆన్‌లైన్‌లోనే నెడ్‌క్యాప్‌ పరిశీలించి అనుమతిస్తుంది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అల్ట్రా మెగా రెన్యూవబుల్‌ ఎనర్జీ పవర్‌ పార్కులను ప్రతిపాదించిందన్నారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 3 నుంచి 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పార్కులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే 24 వేల మెగావాట్లు సోలార్, విండ్‌ ఉత్పత్తి జరుగుతుందని, ఫలితంగా చౌక విద్యుత్‌ లభించేందుకు ఏపీ కేంద్రం కాబోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement