మేలో కోటిన్నర మంది ఉపాధికి గండి

One And Half Crore People Lost job and employment opportunities In May Month - Sakshi

సాక్షి, అమరావతి: సెకండ్‌ వేవ్‌తో ఒక్క మే నెలలోనే  కోటిన్నర మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌/కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి తాజా నివేదిక వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుతుండటంతో పాటు, అసంఘటిత రంగంలో ఉన్న వారి ఆదాయంలో కోత పడింది.

దేశంలో అసంఘటిత రంగంలో ఉన్న 1.75 లక్షల కుటుంబాలను సీఎంఐఈ సర్వే చేసి ఈ నివేదికను వెల్లడించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత అధికంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్లో అసంఘటిత రంగంలో 39.08 కోట్ల మందికి ఉపాధి లభించగా, మేలో 37.55 కోట్ల మందికే ఉపాధి దక్కింది. ఉద్యోగిత 3.90 శాతం తగ్గడంతో కోటిన్నర మంది ఉపాధి కోల్పోయారు. జనవరి ఆఖరు నుంచి పట్టణాల్లో పెరుగుతూ వస్తున్న నిరుద్యోగిత.. మే 31 నాటికి రికార్డుస్థాయిలో 18 శాతానికి చేరుకుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top