చనిపోయి స్పందించిన వృద్ధురాలు

Old Woman Who Wanted All Relatives Dead Was Alive - Sakshi

తగరపువలస (భీమిలి): జీవీఎంసీ రెండో వార్డుకు చెందిన లక్కోజు అన్నపూర్ణ అనే 74 ఏళ్ల వృద్ధురాలు సోమవారం ఉదయం వృద్ధాప్యం కారణంగా ఇంటి వరండాలో పడిపోయి చనిపోయింది. దీంతో ఇంటి ముందు టెంట్‌ వేసి వారి సాంప్రదాయం ప్రకారం కూర్చొబెట్టారు. బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. పగలంతా ఎండ తీవ్రంగా ఉండటంతో మధ్యాహ్నం 3.30 సమయంలో ఆమె భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు స్నానం చేయిస్తుండగా శరీరంలో కదలికలు కనిపించాయి. వెంటనే పల్స్‌మీటర్‌తో తనిఖీ చేయగా సాయంత్రం 4.30 గంటల వరకు ఆమె స్పందించింది.

70 నుంచి 90 వరకు పల్స్‌ రేట్‌ చూపించడంతో అప్పటి వరకు విషాదం అలుముకున్న ఆ ఇంట సంభ్రమాశ్చర్యాలు చోటుచేసుకున్నాయి. వెంటనే ఆమెకు కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అనంతరం స్పూన్‌తో టీ తాగించగా గుటకలు వేసింది. ఆమె స్పందిస్తున్నందుకు సంతోషంతో ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహన సిబ్బందికి ఫోన్‌ చేశారు. వారు సాయంత్రం 5 గంటలకు వచ్చి తనిఖీలు చేయగా చనిపోయినట్టు నిర్ధారించారు. అంతలోనే మళ్లీ వారింట విషాదం అలముకుంది. అనంతరం ఆమెకు అంత్యక్రియలు పూర్తి చేశారు.  

(చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి రామలక్ష్మి ఏం చేసిందంటే..?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top