‘నివర్’ పడగ; హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Nivar Cyclone: Railway Helpline, Kadapa Control Room Numbers - Sakshi

సాక్షి, కడప: నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ సి హరికిరణ్ సూచించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించినట్టు ఆయన తెలిపారు. జిల్లా కలెక్టరేట్  కార్యాలయంతో పాటు కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. (నివర్‌ తుఫాన్‌: 26 విమానాలు రద్దు..)

కలెక్టర్‌ ఇంకా ఏమన్నారంటే..

 • నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
 • చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు.
 • ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరమైన ఇసుక బ్యాగ్స్ ను అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలి.
 • పూరి గుడిసెలు, పాత మిద్దెలు, మట్టితో కట్టిన ఇళ్ళల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి బంధువుల ఇంటికి కానీ, లేదా ప్రభుత్వం చూపించే తాత్కాలిక  పునరావాస కేంద్రాలకు చేరుకోవాలి.
 • నివర్ తుఫాన్ కారణంగా రేపు (గురువారం) జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు దినంగా ప్రకటించిన డీఈఓ శైలజ

కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..

 • జిల్లా కలెక్టరేట్  కార్యాలయం కంట్రోల్ రూమ్ : 08562 - 245259
 • సబ్ కలెక్టర్ కార్యాలయం, కడప :  08562 - 295990,  93814 96364, 99899 72600
 • సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజంపేట : 08565 - 240066, 93816 81866
 • ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు :  96766 08282, 08560- 271088

దక్షిణమధ్య రైల్వే హెల్ప్‌లైన్లు
నివర్‌ తుపాను నేపథ్యంలో రైల్‌ సర్వీసుల్లో మార్పులుండే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. తుపాను ప్రభావం చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకా వైపు వెళ్లే రైళ్లపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రయాణికుల సమాచారం మేరకు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. ప్రయాణికులు సహాయం కోసం ఈ కింది నంబర్లలో సంప్రదించవచ్చు.

 • సికింద్రాబాద్‌: 040-27833099
 • విజయవాడ: 0866-2767239
 • గుంటూరు: 0863-2266138
 • గుంతకల్లు: 7815915608
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top