
సాక్షి, నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో గత రాత్రి(శుక్రవారం) దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బీఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది.
మైథిలికి, నిఖిల్‌కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆపై ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు నిఖిల్. ఘటన అనంతరం నిందితుడు పీఎస్‌లో లొంగిపోయాడు. మైథిలీ మృతదేహాన్ని నెల్లూరు మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.