వైఎస్సార్‌ మనసున్న మహారాజు: ఎంపీ విజయసాయిరెడ్డి

MP Vijayasai Reddy Attends YSR Memorial Meeting In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ మనసున్న మహారాజు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో వైఎస్సార్‌ సంస్మరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్సార్‌ సుపరిపాలన అందించారన్నారు. వైఎస్సార్‌ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుస్తున్నారని తెలిపారు.

‘‘ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యం. ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

వ్యవసాయాన్ని పండగ చేశారు: మంత్రి అవంతి
దివంగత మహానేత వైఎస్సార్‌ భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో కొలివై ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని కొనియాడారు. రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చిన గొప్ప నేత అని, అభివృద్ధి విషయంలో వైఎస్సార్‌ రాజకీయాలు చూడలేదని మంత్రి అవంతి అన్నారు.

ఇవీ చదవండి:
మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ 
చిరునవ్వుల వేగుచుక్క 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top