Movie On Amma Vodi Scheme: MLA Chetti Palguna To Play Headmaster Role - Sakshi
Sakshi News home page

Movie On Amma Vodi: ‘అమ్మఒడి’పై సినిమా.. ప్రధానోపాధ్యాయుడి పాత్రలో ఎమ్మెల్యే

Dec 25 2021 1:55 PM | Updated on Dec 25 2021 3:48 PM

Movie On Amma Vodi Program MLA Chetti Palguna Acts As Headmaster - Sakshi

అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.

పాడేరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవరత్నాల్లోని అమ్మఒడి పథకం పేరు మీద శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్‌ ఓ చలనచిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే వెండితెర మీదకు రానున్న ఈ చిత్రంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.

తహసీల్దార్‌ ప్రకాష్‌రావు ఎమ్మెల్యేకు క్లాప్‌ కొట్టారు. షూటింగ్‌ అనంతరం ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలలో అమ్మఒడి ఒకటని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు పేరుతో ఊహించని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. అమ్మఒడి పథకంపై చలనచిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు. ఈ చిత్రానికి త్రినాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
(చదవండి: Rythu Bharosa: ఆర్బీకే సేవలకు కేంద్ర మంత్రులు ఫిదా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement