అమ్మపాలే ‘అమృతం’

Mother Milk Celebrations in Guntur From Today - Sakshi

నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు 

గుంటూరు మెడికల్‌: శిశుమరణాల నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం చేపట్టింది. అందులో భాగంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు మొదటి వారాన్ని తల్లిపాల వారోత్సవంగా 1992లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించి 210 దేశాల్లో అమలు చేస్తోంది. తల్లిపాల ఆవశ్యకత గురించి వరల్డ్‌ అలయన్‌ ఫర్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ యాక్షన్‌ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. ఆగస్టు ఒకటో నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిసస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. 

తల్లిపాలతో ప్రయోజనాలు...  
తల్లిపాలలో సహజ సిద్ధమైన ప్రొటీన్లు లాక్టొఫెరిన్, కోలోస్ట్రమ్, కొన్ని కీలకమైన హార్మోన్లు, రోగ నిరోధక బ్యాక్టీరియా ఉంటాయి. 
తల్లిపాలు తాగే పిల్లలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. డబ్బాపాలు తాగే పిల్లల కంటే చురుగ్గా ఉంటారు. 
తల్లి బిడ్డకు పాలు ఇవ్వటంతో తల్లీబిడ్డ మధ్య అనుబంధం పెనవేసుకుంటుంది. 
మంచి గుణాలు, మానవ సంబంధాలు శిశువులో పుట్టుక నుంచే అలవడతాయి. 
పాలిచ్చే తల్లులకు క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 
పొత్తికడుపు త్వరగా తగ్గిపోతుంది. పాలు ఇస్తున్నంతకాలం  వెంటనే గర్భం రాకుండా కృత్రిమంగా ఆగిపోతుంది. 
ప్రసవ సమయంలో అయ్యే బ్లీడింగ్‌ కూడా త్వరగా తగ్గిపోతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top