గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి

Minister Peddireddy Said 90 Percent Guarantees Fulfilled CM Jagan - Sakshi

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు

సాక్షి, చిత్తూరు: జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్‌లైన్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు

వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్‌ వినిపించాలన్నారు. సామాన్యులను పార్లమెంట్‌కు పంపించిన ఘనత సీఎం జగన్‌దన్నారు. మాధవి, నందిగం సురేష్‌లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్‌కు వెళ్తారని కన్నబాబు ధీమావ్యక్తం చేశారు.
చదవండి:
కోవిడ్‌ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్‌ 
టీడీపీ అధికారంలోకి వచ్చేది ఒక కల మాత్రమే: అంబటి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top