ఏపీ: ఆగస్టు 15న డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్రారంభం

Minister Mekapati Goutham Reddy Review On IT Department - Sakshi

ప్రతి జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా జాబ్ మేళా

ఐటీ శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సమీక్ష

ఈఎంసీ, ఐటీ ప్రమోషన్, పాలసీ తదితర అంశాలపై చర్చ

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఆగస్టు 15న డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్రారంభించనునట్లు తెలిపారు. గురువారం ఆయన ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈఎంసీ, ఐటీ ప్రమోషన్, పాలసీ తదితర అంశాలపై చర్చించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, అధికారులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్కిల్ కాలేజీల పనుల పురోగతి, నిధుల సమీకరణలో వేగానికి చర్యలు తీసుకోవాలన్నారు. 

బ్యాంకులతో సంప్రదించి నిధులు తెచ్చుకునే మార్గాలపై అన్వేషించాలని సూచించారు.  స్కిలింగ్ కోర్సులు, ట్రైనింగ్, ప్రమోషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌తో ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్‌ని అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ ప్రాధాన్యత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

స్కిల్ కాలేజీలను ప్రభుత్వం నిర్దేశించిన రూ.20 కోట్ల బడ్జెట్‌లో అత్యాధునికంగా తీర్చిదిద్దే డిజైనింగ్‌లు కూడా పూర్తయ్యాయని మంత్రికి  ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగారు రాజు వివరించారు. నెల్లూరు జిల్లాలోని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వెంకటగిరి, కర్నూలు జిల్లా డోన్ స్కిల్ కాలేజీల భూ సేకరణ పనుల పురోగతిపై మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. అత్యాధునిక కోర్సుల ద్వారా శిక్షణ అందిస్తే ఉద్యోగాల కల్పన సులభమవుతుందని మంత్రి వెల్లడించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న స్కిల్ కాలేజీ భూసేకరణ పనిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top