‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే’

Minister Avanthi Srinivas Fires On Chandrababu In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు.  విశాఖలో రెండోరోజు కొనసాగుతున్న జనాగ్రహ దీక్షలో మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్నదని విమర్శించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుదన్నారు. తమ ప్రభుత్వం పార్టీలు, కులమతాలకతీతంగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 

ప్రజాస్వామ్యంలో విమర్శలు సహేతుకంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
ఏపీలో టీడీపీ వెంటిలేటర్‌పై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో టీడీపీ పాలన ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని అన్నారు. 2019 నుంచి ప్రతి ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. లోకేష్‌ ట్విట్టర్‌లో అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి పక్షం ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ అసభ్యంగా దూషించడం సరికాదని ఎంపీ విజయసాయిరెడ్డి హితవు పలికారు.  

చదవండి: ఏపీలో ఉవ్వెత్తున జనాగ్రహ దీక్షలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top