‘యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ | Minister Anil Kumar Yadav Meeting Irrigation Projects With Officers | Sakshi
Sakshi News home page

‘యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

May 24 2021 10:03 PM | Updated on May 24 2021 10:28 PM

Minister Anil Kumar Yadav Meeting Irrigation Projects With Officers - Sakshi

సాక్షి, అమరావతి: ఇరిగేషన్ అధికారులతో సోమవారం మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పోలవరంతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆరా తీశారు. ఆర్‌అండ్‌ఆర్‌పై దృష్టి పెట్టి నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.

చదవండి: ఆనందయ్య మందుతో ఎలాంటి ప్రమాదం లేదు: ఆయుష్‌

Advertisement
 
Advertisement
Advertisement