Minister Ambati Rambabu Comments On Chandrababu Over Polavaram Construction Works - Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో పోలవరాన్ని సర్వనాశనం చేశారు: మంత్రి అంబటి

Feb 17 2023 1:21 PM | Updated on Feb 17 2023 2:55 PM

Minister Ambati Rambabu Comments On Chandrababu - Sakshi

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో పోలవరంలో ఎంపీలు, ఎమ్మెల్యే బృందం శుక్రవారం పర్యటించింది.

సాక్షి, ఏలూరు జిల్లా: ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో పోలవరంలో ఎంపీలు, ఎమ్మెల్యే బృందం శుక్రవారం పర్యటించింది. దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో హిల్ వ్యూ నుండి ప్రాజెక్ట్‌ను బృందం పరిశీలించింది. ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ధనలక్ష్మి పోలవరం పనులు పురోగతిని పరిశీలించారు.

అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. ‘‘పోలవరం పూర్తి కోసం చిత్తుశుద్ధిగా పనిచేస్తున్నాం. చంద్రబాబుకు ప్రచార యావ తప్ప మరొకటి లేదు. కాఫర్‌ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్‌ నిర్మించారు. టీడీపీ హయాంలో పోలవరాన్ని సర్వనాశనం చేశారు. చంద్రబాబు చేసిన పాపాల వల్లే పోలవరానికి ఈ దుస్థితి’’ అంటూ మంత్రి అంబటి మండిపడ్డారు.
చదవండి: టీడీపీ స్కెచ్‌.. ‘నీ పంట దున్నెయ్‌.. లీడర్‌ని చేస్తాం..’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement